Veerulapadu: పెన్షన్ల ఆన్‌లైన్‌లో కూటమి వివక్షపై జగన్మోహన్ రావు ధర్నా

Veerulapadu: వీరులపాడు మండలంలో పెన్షన్ల ఆన్‌లైన్ నమోదులో టీడీపీ వర్గీయ వివక్ష చూపుతోందని వైకాపా మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఆందోళన చేపట్టారు.

Naresh, Nandigama
Published on: 10 Sept 2026 5:54 PM IST
Veerulapadu
X

Veerulapadu: పెన్షన్ల ఆన్‌లైన్‌లో కూటమి వివక్షపై జగన్మోహన్ రావు ధర్నా

వీరులపాడు: వీరులపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోయిందని ఆరోపించారు వైకాపా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు.

నూతన పెన్షన్ ఆన్ లైన్ లో విధానంలో వివక్షగా చూపించి గ్రామ సచివాలయంలో కేవలం టిడిపి నాయకులు చెప్పిన వారికే పెన్షన్లు ఆన్ లైన్ చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల సామాన్యులు వృద్ధులు, వితంతువులు గత వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

గ్రామ సచివాలయ సిబ్బంది తెలుగుదేశం నాయకుల ఆదేశాలు అమలు చేస్తూ వైసీపీ సానుభూతి పరులకు పెన్షన్ ఆన్ లైన్ చేయకుండా వివక్ష చూపిస్తున్నారని అన్నారు.

గ్రామ సచివాలయ సిబ్బంది కుంటి సాకులు చెబుతూ పెన్షన్ నమోదు చేయడం లేదని తెలుపుతూ జుజ్జూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎదుట ఆందోళన నిర్వహించి ఎంపీడీవో కు వినతి పత్రం అందించారు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story