Chandarlapadu: ఘనంగా వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు !

Chandarlapadu: ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన రంగా గారి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది.

Naresh, Nandigama
Published on: 4 July 2026 3:10 PM IST
Chandarlapadu
X

Chandarlapadu: ఘనంగా వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు !

చందర్లపాడు: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గారితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న విప్, ఎమ్మెల్యే ప్రజాసేవ, సామాజిక న్యాయం, ప్రజా నాయకత్వ విలువలను స్మరించిన నాయకులు.

మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన రంగా గారి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చందర్లపాడు టౌన్‌లో నిర్వహించిన వంగవీటి మోహన రంగా గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు ముఖ్యంగా పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ గారితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి మహానేతకు పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, వంగవీటి మోహన రంగా గారు ప్రజల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా, సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేసిన వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ ప్రజా నాయకత్వానికి కొత్త నిర్వచనం ఇచ్చిన ఆయన సేవలు నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.

ప్రజా నాయకులు చూపిన సేవా మార్గం ప్రతి ప్రజాప్రతినిధికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక సమానత్వం దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి పిట్టల శ్రీదేవి, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వంగవీటి మోహన రంగా గారికి ఘనంగా నివాళులర్పించారు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story