Vuyyuru: ఉయ్యూరులో అడ్డదిడ్డంగా ట్రాఫిక్ పోలీసుల వింత వాదన!

Vuyyuru: ఉయ్యూరులో పద్మవ్యూహాన్ని తలపిస్తున్న ట్రాఫిక్, ఆక్రమణలు. కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి వింత వాదన తెస్తున్న పోలీసులపై ఆగ్రహం.

Ramana, Penamaluru
Published on: 29 Aug 2026 12:25 PM IST
Vuyyuru
X

Vuyyuru: ఉయ్యూరులో అడ్డదిడ్డంగా ట్రాఫిక్ పోలీసుల వింత వాదన!

Vuyyuru: ఉయ్యూరు లో ట్రాఫిక్ పద్మవ్యూహం వార్తపై పోలీస్ అధికారులు స్పందించారు. ఓ కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు చుట్టుపక్కల గ్రామాల వారు ఉయ్యూరు ప్రజలు ఇక్కడికి రావడం వలన సందడిగా ఉంటుంది ఇక్కడ ఉన్న ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తే ఉయ్యూరు ప్రతిష్ట దెబ్బతింటుంది అంటూ వింత వాదన తెచ్చి ఇలా పోస్టులు పెట్టడం ఉయ్యూరు ప్రతిష్టను దెబ్బతీయటమేనంటూ ఎదురుదాడి మొదలెట్టారు.

ఉయ్యూరు పట్నంలో ట్రాఫిక్ పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు ఫుట్పాత్ అయితే అసలు కనపడదు అన్ని ఆక్రమణలు అవి తాత్కాలికం కొన్ని అయితే శాశ్వత కట్టడాలు కూడా ఉన్నాయి.

ఇక రోడ్లమీద అడ్డదిడ్డంగా వ్యాపారాలు ఒక భాగం అయితే ప్రధాన రహదారిని తాకుతూ శాశ్వత నిర్మాణం చేపట్టి వ్యాపారాలు చేస్తున్నవారు ఓ కొల్లలు ఏదో మొక్కుబడిగా ప్రధాన కూడలిలో ఒక పోలీస్ అధికారిని ఉంచి ట్రాఫిక్ నియంత్రిస్తున్నాము అంటూ పోలీస్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.

అవసరాల కోసం సెంటర్ కు వచ్చిన ప్రజలకు ఈ అడ్డదిడ్డమైన ట్రాఫిక్ చుక్కలు చూపిస్తున్నాయి.దీనికి తోడు భారీ వాహనాలు సైతం ఉయ్యూరు టౌన్ లో యదేచిగా తిరుగుతూనే ఉంటాయి. ఇసుక వాహనాలు మట్టి ట్రాక్టర్లు అయితే వాటిని ఆపే వాళ్లే లేరు.

ఇక కాలేజీ రోడ్డులోని మంత్రి గారి స్కూల్ అయితే రోడ్డె వారి అడ్డ రోడ్డు మీదే బస్సులు నిలిపి విద్యార్థులను ఎక్కించడం తర్వాత రోడ్ల మీద పార్క్ చేయటం వారిని అడిగే వారు లేరు ప్రశ్నించేవారు లేరు.

ఇక రావి చెట్టు బజార్ అయితే రోడ్డు మీద ఆటోలు రోడ్డు మీద వ్యాపారాలు ఏదేచిగా జరుగుతుంటాయి కానీ ఏ ఒక్కరికి ఇవి కనపడవు.

ప్రధాన సెంటర్లలో మరియు రోడ్లలో రోడ్ల ఆక్రమించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వారిని క్రమబద్ధీకరించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడవలసిన పోలీస్ శాఖ ఇలా తీసేస్తే ఉయ్యూరు ప్రతిష్ట దెబ్బతింటుంది అంటూ వింత వాదన చేయడం ఆశ్చర్యంగా ఉంది.

రోజువారి జీవనం కోసం బండ్లు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు ... కానీ వారు అదే షాపు వారికి వేలకు వేలు చెల్లిస్తున్నారు.ఇక్కడ ఎవరు లాభపడుతున్నారు.

సరే ఆ విషయానికి వద్దాం మరి షాప్ అద్దెకి తీసుకున్న వ్యాపారులు ఎందుకు ఫుట్పాట్ బయటకు నిర్మాణం చేపట్టి వ్యాపారం చేస్తున్నారు.

ఆక్రమణలు తొలగిస్తే అడ్డవదిడ్డమైన పార్కింగ్ ను నియంత్రిస్తే మరింత మంది ఉయ్యూరును సందర్శించి తమ అవసరాలను తీర్చుకుంటారు దీని వలన ఉపయోగం జరుగుతుంది గానీ ప్రతిష్ట దెబ్బతినదు.

ఈ విషయాన్ని గ్రహించి ఉయ్యూరు లో ఉన్న అడ్డదిడ్డమైన ట్రాఫిక్ మరియు అక్రమ నిర్మాణాలు స్వార్థపరుల కు వ్యాపారాలుగా మారుతున్న ప్రభుత్వ రోడ్లను నియంత్రిస్తే బాగుంటుందనేది ఉయ్యూరు ప్రజల అభిప్రాయం.దీనిపై ప్రజలు మీ విలువైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story