Tiruvuru: ముద్రగడ పద్మనాభం మృతికి నల్లగట్ల స్వామిదాస్ సంతాపం

Tiruvuru: ముద్రగడ పద్మనాభం మృతిపై తిరువూరు ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ దిగ్భ్రాంతి. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ నేతలు.

Venkateswara Rao, Tiruvuru
Published on: 15 July 2026 9:20 PM IST
Tiruvuru
X

Tiruvuru: ముద్రగడ పద్మనాభం మృతికి నల్లగట్ల స్వామిదాస్ సంతాపం

తిరువూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి పట్ల తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ తీవ్ర సంతాపం తెలిపారు. ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా, కాపు సమాజ హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చిరస్మరణీయులని ఆయన అభివర్ణించారు.

ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు, వైసీపీకి తీరని లోటని నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. దశాబ్దాలుగా కాపు ఉద్యమ నేతగా, ప్రజా నాయకుడిగా ముద్రగడ పద్మనాభం అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru

Next Story