Tiruvuru: తిరువూరు సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే కొలికపూడి ప్రత్యేక పూజలు!
Tiruvuru: తిరువూరు సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థనలు చేశారు.
Tiruvuru: తిరువూరు సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే కొలికపూడి ప్రత్యేక పూజలు!
* ఎన్టీఆర్ జిల్లా:
* తిరువూరు టౌన్ :-గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
* ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొని, సాయిబాబాకు విశేష పూజలు నిర్వహించారు.
* ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గురు పౌర్ణమి పర్వదినం గురువుల పట్ల కృతజ్ఞతను చాటుకునే రోజని, గురువుల మార్గదర్శకత్వం లేకుండా ఏ వ్యక్తి జీవితంలోనూ ఉన్నత స్థానానికి చేరుకోలేడని అన్నారు.
* ప్రజలందరూ గురు పౌర్ణమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, సమాజంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలని సాయిబాబాను ప్రార్థించారని తెలిపారు.
* ఈ పూజా కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.
* అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కూడా నిర్వహించారు.




