Vuyyuru: ఉయ్యూరులో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పర్యటన!

Vuyyuru: కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రముఖ వ్యాపారవేత్త బోళ్ల నాని నివాసానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాక. ఆత్మీయ ఆతిథ్యం పొంది హైదరాబాద్ పయనం.

Ramana, Penamaluru
Updated on: 10 Sept 2026 9:24 PM IST
Vuyyuru
X

Vuyyuru: ఉయ్యూరులో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పర్యటన!

ఉయ్యూరు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్తె, అల్లుడు, మనవడు ఉయ్యూరులోని ప్రముఖ వ్యాపారవేత్త బోళ్ల నాని నివాసానికి విచ్చేశారు.

ఈ సందర్భంగా బోళ్ల నాని కుటుంబ సభ్యులు వారికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరు కుటుంబాల సభ్యులు కలిసి ఆత్మీయంగా భోజనం చేశారు.

కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి కొంతసేపు సరదాగా ముచ్చటించుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సమయాన్ని గడిపారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత, స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. కొంతసేపు ఉయ్యూరులో గడిపిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story