Vuyyuru: ఉయ్యూరు VRKM పాఠశాలలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం!
Vuyyuru: ఉయ్యూరు VRKM పాఠశాలలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం.. గురువులకు నూతన వస్త్రాలు, శాలువాలతో ఘన సన్మానం.
Vuyyuru: ఉయ్యూరు VRKM పాఠశాలలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం!
Vuyyuru: కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యురు. ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గురువులకు హ్రుదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన అతిధులు పూర్వ విద్యార్థుల సంఘ నాయుకులు.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక వి ఆర్ కె ఎం పాఠశాలలో ఏర్పాటుచేసిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కెసిపి unit head మరియు పాఠశాల కరస్పాండెంట్ శ్రీ వై.యస్.ఆర్ దాస్ గారు, శ్రీ వై.వి.రత్న ప్రసాద్ గారు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్ సంపత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుశ్రీ వై.వి.రావు గారి ఆధ్వర్యంలో భారత మొదటి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వై వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్ సంపతకుమార్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడంలో అమూల్యమైన సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు పూర్వ విద్యార్థులు సంఘ అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదువుకున్న మేము ఉన్నతమైన స్థానం లో వున్నాము అని గురువులను గౌరవించడం మన సాంప్రదాయం అని తెలిపారు.
జనరల్ సెక్రటరీ పినమాల నాగ కుమార్ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో ఉపాధ్యాయుల శ్రమను త్యాగాన్ని ప్రతి విద్యార్థి సమాజం గుర్తుంచుకోవాలని ప్రతి విద్యార్థి గురువులు చెప్పినట్టు క్రమశిక్షణ పాటించాలని తెలిపారు అనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయులుకు కేసిపి కార్మిక సంఘ నాయకులు
శ్రీ బాలసుబ్రమణ్యం గారు రోటరీ క్లబ్ మరియు పూర్వ విద్యార్థులు కలిసి నూతన వస్త్రాలు,శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేసిపి సంస్థ కార్మిక నాయుకుడు బాలసుబ్రహ్మణ్యం గారు, రోటరీ క్లబ్ అధ్యక్షులు ఎస్ సంపత్ కుమార్, సెక్రటరీ అమీర్ మీర్జా, స్కూల్ హెడ్మాస్టర్ వై వెంకటేశ్వరరావు,
పూర్వ విద్యార్థులు వెలివెల వెంకట రాజేష్ కుమార్, పినమాల నాగ కుమార్ , కెసిపి యాజమాన్య సంస్థ ప్రతినిధులు Y.V.రత్న ప్రసాద్ ,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




