Avanigadda: ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌పై మాజీ ఎమ్మెల్యే సింహాద్రి ఆగ్రహం!

Avanigadda: కృష్ణా డెల్టాకు సాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ధ్వజమెత్తారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 28 Aug 2026 5:28 PM IST
Avanigadda
X

Avanigadda: ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌పై మాజీ ఎమ్మెల్యే సింహాద్రి ఆగ్రహం!

Avanigadda: అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారు ఈరోజు అవనిగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ధాన్యం, మొక్కజొన్న రైతులు దగ్గర నుంచి దళారులు దగ్గరకు వెళ్ళాక రేట్లు పెరిగాయి:-మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు.

వ్యవసాయానికి నీళ్లు సరిగ్గా అందక రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఏల్నినో ప్రభావం వలన వర్షాలు ఉండవని 2027 వరకు నీళ్లు ఇవ్వలేమని చెబుతున్నారు. నిన్న కూడా 3 లక్షల 50 వేల క్యూసెక్కుల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోయాయి. పట్టిసీమ, పులిచింతల నుంచి నీళ్లు ఇమ్మని అడుగుతుంటే మంత్రి రామానాయుడు గత ప్రభుత్వం అర టీఎంసీల నీరు ఉంచిందని చెబుతారు.

గత ప్రభుత్వం అర టీఎంసీల నీరు నిల్వ ఉంచి రైతులకు మేలు చేసింది. అర టీఎంసీల నీరు ఉండేదాకా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కృష్ణ డెల్టాకు నీరు ఇచ్చారు. నేడు 29 టీఎంసీల నీరు పెట్టుకుని ఇవ్వలేకపోతున్నారు. వ్యవసాయాన్ని చంపేద్దామని ఆలోచనతో సీఎం చంద్రబాబు నీళ్ళు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు.

వెంటనే నీళ్లు ఇచ్చి రైతులను అదుకోకపోతే కృష్ణ డెల్టా సర్వనాశనం అయిపోతుంది. అరగంటకో మాట మాట్లాడి పిల్లల పార్టీ అన్న పార్టీలోనే ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ చేరారు. ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ లా దరిద్రపు రాజకీయాలు చేసేవాళ్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేరు. బుద్ద ప్రసాద్ నిమిషానికి ఓ మాట మాట్లాడుతారు.

నీతి, నిజాయితీ, చిత్త శుద్ధి, బుద్ధి అనేది ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కి లేదు. పేరుకే బుద్ధ ప్రసాద్, ఆయన బుద్ధుడు కానే కాదు ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ చెప్పేవన్నీ అబద్ధాలే. ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. గతంలో డెడ్ స్టోరేజ్ లో ఉండగా నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఇచ్చారు.

పట్టిసీమ, పులిచింతలలో నీళ్ళు ఉన్నాయి కనుక వాటి నుంచి నీళ్లు ఇచ్చి వ్యవసాయాన్ని కాపాడాలి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు సింహాద్రి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల పై ఎన్నికల కమిషన్ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వార్ డివిజన్స్ చేసేశారని, వార్ డివిజన్స్ చేసేటప్పుడు ఎవరిని సంప్రదించకుండా, వాటిని ఆమోదించేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్నారని, ఏమిటని ప్రశ్నిస్తే కంప్యూటర్ లో అలా వస్తున్నాయని, సమాధానం చెబుతున్నారని, భారత ఎన్నికల కమిషను రూల్స్ ప్రకారం 2కిలో మీటర్లు దాటివెళ్లి వేయకూడదని, కానీ కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అవకతవకలకు పాల్పడుతుందని, ఓటర్ లను ఇబ్బందులను గురిచేస్తుందని అన్నారు.

ఈ మీడియా సమావేశంలో అవనిగడ్డ జడ్పీటీసీ మరియు కృష్ణాజిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు చింతలపూడి లక్ష్మీనారాయణ(లచ్చి), అవనిగడ్డ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేపల్లె శ్రీనివాసరావు, అవనిగడ్డ మాజీ సర్పంచ్ మరియు కృష్ణాజిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ విభాగం ఉపాధ్యక్షులు నలుకుర్తి పృథ్వీరాజ్, కృష్ణాజిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల విభాగం అధ్యక్షులు మద్ది వెంకటనారాయణ(చిన్న), రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం కార్యదర్శి గాజుల జయ గోపాల్(గోపి) మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story