Penamaluru: పెనమలూరులో ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యం తప్పిన పెను ప్రమాదం!

Penamaluru: పెనమలూరు సెంటర్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చిన్నారికి ప్రమాదం తప్పింది. సిబ్బంది తీరుపై ప్రజల ఆగ్రహం, చర్యలు తీసుకోవాలని డిమాండ్.

Ramana, Penamaluru
Published on: 19 Aug 2026 7:51 AM IST
Penamaluru
X

Penamaluru: పెనమలూరులో ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యం తప్పిన పెను ప్రమాదం!

Penamaluru: మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పేరుతో ప్రభుత్వం సౌకర్యం కల్పిస్తుంటే.. ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసం? బస్సు డ్రైవర్లు మహిళా ప్రయాణికురాలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఆర్టీసీ సిబ్బందిపై ఉంది.

డ్రైవర్ నిర్లక్ష్యానికి ఒక చిన్నారి ప్రాణం పోయి ఉంటే బాధ్యత ఎవరిది? పెనమలూరు సెంటర్లో జరిగిన ఘటన ప్రమాదం తప్పిన ఘటనగా కాకుండా.. ఆర్టీసీ యాజమాన్యానికి ఒక హెచ్చరికగా చూడాలి.

ఉచిత ప్రయాణం ఇచ్చాం కాబట్టి ప్రయాణికుల భద్రతను ఉచితంగా చూడకూడదు. డ్రైవింగ్‌లో ఏమాత్రం నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.

టికెట్ తీసుకోవడం కంటే ప్రాణాలను కాపాడటం ముఖ్యం.. ప్రజలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన ఆర్టీసీ బస్సులే ప్రమాదాలకు కారణమైతే.. ఈ వ్యవస్థపై అధికారులు తక్షణమే సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story