Penamaluru: మెడికల్ & హెల్త్ ఔట్‌సోర్సింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షేక్ షాజిదా

Penamaluru: నవ్యాంధ్రప్రదేశ్ మెడికల్ & హెల్త్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా షేక్ షాజిదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Ramana, Penamaluru
Published on: 8 Sept 2026 4:15 PM IST
Penamaluru
X

Penamaluru: మెడికల్ & హెల్త్ ఔట్‌సోర్సింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షేక్ షాజిదా

పెనమలూరు: నవ్యాంధ్రప్రదేశ్ మెడికల్ & హెల్త్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గా షేక్ షాజిదా ఏకగ్రీవ ఎన్నిక. నవ్యాంధ్రప్రదేశ్ మెడికల్ & హెల్త్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ( Regd. No. 309/2026)

రాష్ట్ర అసోసియేషన్ ఏర్పాటు మరియు రాష్ట్ర స్థాయి కార్యవర్గం ఎన్నిక సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సభ్యులు, ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్ పరిధిలో పనిచేస్తున్న అన్నీ రకాల కేటగిరీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం , హక్కులు, ఉద్యోగ భద్రత మరియు న్యాయమైన HR విధానాల కోసం అసోసియేషన్ కృషి చేస్తుందని రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ షేక్ షాజిదా తెలిపారు.

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి చట్టబద్ధమైన, ప్రజాస్వామ్య మరియు శాంతియుత పద్ధతుల్లో తీసుకెళ్లడంతో పాటు, ఉద్యోగులలో ఐక్యత, క్రమశిక్షణ, జవాబుదారీతనం మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ షేక్ షాజిదా తెలిపారు.

“పదవికంటే సేవ, స్వార్థం కంటే సభ్యుల సంక్షేమం, విభేదాల కంటే ఐక్యత” అనే సూత్రాలతో అసోసియేషన్‌ను ముందుకు తీసుకెళ్తామని రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ షేక్ షాజిదా పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఐక్యం చేసి, వారి సమస్యలకు సమర్థవంతమైన ప్రాతినిధ్యం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని.రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ షేక్ షాజిదా తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ఉద్యోగులకు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story