Penamaluru: చోడవరంలో నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Penamaluru: పెనమలూరు మండలం చోడవరంలో దాతల సహకారంతో నిర్మించిన నూతన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించి గ్రామ సమస్యలపై కీలక హామీలిచ్చారు.

Ramana, Penamaluru
Published on: 10 Sept 2026 3:59 PM IST
Penamaluru
X

Penamaluru: చోడవరంలో నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్

పెనమలూరు మండలం చోడవరం గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన నూతన గ్రంథాలయాన్ని పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… గ్రామాల సమగ్ర అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం ఎంతో అభినందనీయమని అన్నారు,సుమారు ₹20 లక్షల విలువైన భూమిని గ్రంథాలయ నిర్మాణానికి ఉచితంగా అందించిన దాత ప్రసాద్ గారికి అలాగే CSR కింద ₹10 లక్షల గ్రాంట్ అందించిన కెనరా బ్యాంక్ యాజమాన్యానికి,ఉద్యోగులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే రోడ్లు,డ్రైన్లు మాత్రమే కాదు… విద్య, విజ్ఞానం కూడా అవసరం అని పేర్కొన్న ఎమ్మెల్యే గారు, గ్రంథాలయాలు యువతలో పఠనాసక్తిని, జ్ఞానాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. చోడవరం గ్రామ అభివృద్ధికి సంబంధించి ప్రజలకు పలు కీలక హామీలు ఇచ్చారు.

ఇసుక లారీల రాకపోకలతో దెబ్బతిన్న ప్రధాన రహదారి మరమ్మతులు పండుగలోపే పూర్తి చేసేలా R&B అధికారులతో చర్యలు తీసుకుంటాం...

రైతు భరోసా కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన ₹3–4 లక్షల నిధులను రాబోయే 15 రోజుల్లో జిల్లా పరిషత్ నిధుల నుంచి కేటాయించి భవనాన్ని పూర్తి చేస్తాం...

సిమెంట్ రోడ్డు నుంచి పెనమలూరు వరకు రహదారి విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికే కోరాం, రాబోయే కాలంలో ఈ రహదారి విస్తరణ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం...

స్థానిక నేల స్వభావానికి మ్యాజిక్ డ్రైన్లు అనుకూలంగా ఉండవని,తాత్కాలిక పరిష్కారాలకు కాకుండా పక్కా,శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి అదనపు లైన్‌మ్యాన్ కేటాయించేలా విద్యుత్ శాఖ SEతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా గ్రామంలో వాటర్ ట్యాంక్,ఆలయ అభివృద్ధి,పంచాయతీకి కంప్యూటర్ వంటి పలు కార్యక్రమాలకు ముందుకు వచ్చిన దాత ప్రసాద్ గారి సేవలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు అభినందించారు అలాగే ఆకునూరులో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఆయన అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు.

చోడవరం గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు రాబోయే 2–3 సంవత్సరాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇతర ప్రభుత్వ గ్రాంట్లను సమన్వయం చేస్తూ గ్రామంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి,శాశ్వత పరిష్కారాలు చూపిస్తామని ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు స్పష్టం చేశారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story