Penamaluru: ఉప్పులూరులో కొత్త గోల్డ్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్!

Penamaluru: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరులో గద్దె శ్రీధర్ ఏర్పాటు చేసిన నూతన గోల్డ్ షాప్‌ను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు.

Ramana, Penamaluru
Published on: 31 Aug 2026 10:09 PM IST
Penamaluru
X

Penamaluru: ఉప్పులూరులో కొత్త గోల్డ్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్!

పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలో గద్దె శ్రీధర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డ్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హాజరై నూతన వ్యాపార సంస్థను ప్రారంభించారు.

ఈ సందర్భంగా బోడే ప్రసాద్ గద్దె శ్రీధర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన వ్యాపార సంస్థ దినదినాభివృద్ధి చెందాలని, వ్యాపార రంగంలో మంచి గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ వారి విశ్వాసం, ఆదరణ పొందాలని శ్రీధర్‌ను అభినందించారు.

స్థానికంగా కొత్త వ్యాపార సంస్థలు ఏర్పడటం గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యాపారాన్ని అంకితభావంతో ముందుకు తీసుకెళ్లి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీధర్‌కు సూచించారు.

కార్యక్రమంలో శ్రీధర్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రజలు, వ్యాపార ప్రముఖులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని నూతన గోల్డ్ షాప్ యజమాని గద్దె శ్రీధర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story