Penamaluru: నలుగురు లబ్ధిదారులకు రూ. 8.17 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ పత్రాలు
Penamaluru: పెనమలూరులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదేశాలతో నలుగురు లబ్ధిదారులకు రూ.8.17 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ పత్రాలను టీడీపీ నాయకులు అందజేశారు.
Penamaluru: నలుగురు లబ్ధిదారులకు రూ. 8.17 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ పత్రాలు
పెనమలూరు: పెనమలూరు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారి ఆదేశాల మేరకు,నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.8,17,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) LOC పత్రాలను తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చింది,ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ,ప్రతి కుటుంబానికి అండగా నిలిచి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారి ప్రజాసేవా దృక్పథాన్ని లబ్ధిదారులు,స్థానికులు కొనియాడారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రజల కోసం ప్రభుత్వం అనే నినాదాన్ని ఆచరణలో నిలబెడుతోంది.ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్నాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.




