Penamaluru: పెనమలూరు: గణేష్ ఉత్సవాల భద్రతపై పోలీసుల సమీక్ష
Penamaluru: పెనమలూరులో గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి. డీజేలకు నో పర్మిషన్, సీసీ కెమెరాలు మస్ట్ అని సీఐ ఎన్. వెంకట నారాయణ స్పష్టం చేశారు.
Penamaluru: పెనమలూరు: గణేష్ ఉత్సవాల భద్రతపై పోలీసుల సమీక్ష
పెనమలూరు: పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, మండపాల నిర్వహణ మరియు ప్రతిమల ఊరేగింపుల సమయంలో నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని పెనమలూరు పోలీస్ స్టేషన్ సీఐ ఎన్. వెంకట నారాయణ గారు సూచించారు.
ఈరోజు అన్నెవరికి కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా నిపుణులైన ఎలక్ట్రీషియన్లతోనే వైరింగ్ చేయించాలని, అగ్నిప్రమాదాల నివారణకు అగ్నిమాపక పరికరాలు లేదా ఇసుక, నీటి బకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
భద్రత కోసం ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు దొంగతనాలు, రద్దీని నియంత్రించేందుకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా వాలంటీర్లను నియమించాలని ఆదేశించారు. ఊరేగింపుల సమయంలో శబ్ద కాలుష్యానికి కారణమయ్యే డీజేలకు అనుమతి లేదని, డప్పులు, సన్నాయి వంటి సాంప్రదాయ వాయిద్యాలనే వాడాలని తెలిపారు.
విద్యుత్ వైర్లకు విగ్రహాలు తగలకుండా తగినంత ఎత్తు నిబంధనలు పాటించాలని, చిన్న సందుల్లో ఊరేగింపుల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని, మద్యం సేవించి ఊరేగింపుల్లో పాల్గొనడం, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పాటలు ప్లే చేయడంపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రోగులు, వృద్ధులు, విద్యార్థులకు ఆటంకం కలగకుండా పోలీసు శాఖ నిర్దేశించిన సమయ వేళలను ఖచ్చితంగా పాటిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.




