Penamaluru: మత్స్యశాఖ కార్యాలయం వద్ద ఆక్వా రైతుల నిరసన
Penamaluru: పెనమలూరులో మత్స్యశాఖ కమిషనర్ తీరును నిరసిస్తూ ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించకుంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు.
Penamaluru: మత్స్యశాఖ కార్యాలయం వద్ద ఆక్వా రైతుల నిరసన
పెనమలూరు: పెనమలూరు మండలం గంగూరు గ్రామంలోని రాష్ట్ర మత్స్య శాఖ కార్యాలయలో వివిధ జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేసి మత్స్య శాఖ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షోభంలో ఉన్న రొయ్యల సాగును కాపాడాలని కోరేందుకు వెళ్లిన రైతు ప్రతినిధులను ఉద్దేశించి మత్స్యశాఖ కమిషనర్ "మీరు నిజమైన రైతులేనా?" అంటూ అవమానకరంగా మాట్లాడటాన్ని రాష్ట్ర రొయ్యల రైతులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు రైతు సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదన, డిమాండ్లను వెల్లడించారు.
సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన రైతులను గుర్తించకుండా, వారి అస్తిత్వాన్ని ప్రశ్నించడం గర్హనీయమని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ద్వారా విచారించి నిజమైన రైతులెవరో తేల్చుకోవాలని హితవు పలికారు.
గత ఆరు నెలల్లో టైగర్ రొయ్యల ఫీడ్ ధర కేజీకి రూ. 26, వెనామీ ఫీడ్ ధర రూ. 22 మేర అమాంతం పెంచారని తెలిపారు. ఫీడ్ కంపెనీలు ముడిసరుకును ఏడాదికి సరిపడా ఒకేసారి కొనుగోలు చేస్తూ, ధరలను మాత్రం తరచూ పెంచి రైతుల నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు.
ఒకవైపు ఫీడ్ ఖర్చులు పెరగగా, మరోవైపు ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్‌గా మారి కొనుగోలు ధరలను దారుణంగా తగ్గించారని ఆరోపించారు. 30 కౌంట్ రొయ్యల ధరను రూ. 580 నుంచి రూ. 430కి (రూ. 150 తగ్గింపు) పడేశారు. 20 కౌంట్ రొయ్యల ధరను రూ. 720 నుంచి రూ. 580–600కి తగ్గించారు. మేత పెంపు, ఉత్పత్తుల ధరల తగ్గింపుతో రైతులకు కేజీకి రూ. 200




