Krishna: జాతీయ రహదారి వెంబడి అందుబాటులోకి కనెక్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్

Krishna: నియోజకవర్గం ఉయ్యూరు రూరల్ పెదఓగిరాలలో జాతీయ రహదారి వెంబడి 'కనెక్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ డాబా'ను ప్రారంభించిన టీడీపీ యువనాయకుడు బోడే వెంకట్రామ్.

Ramana, Penamaluru
Published on: 8 Sept 2026 12:03 PM IST
Krishna
X

Krishna: జాతీయ రహదారి వెంబడి అందుబాటులోకి కనెక్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్

Krishna: పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు రూరల్ మండలం పెదఓగిరాల గ్రామంలో జాతీయ రహదారి వెంబడి నూతనంగా ఏర్పాటు చేసిన కనెక్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ డాబాను తెదేపా యువనాయకుడు బోడే వెంకట్రామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్, మండల తెదేపా అధ్యక్షుడు వెనిగళ్ల కుటుంబరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బోడే వెంకట్రామ్ రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, వ్యాపారంలో పెట్టుబడిపై రాబడిని మాత్రమే ప్రధాన లక్ష్యంగా కాకుండా, వినియోగదారులకు అత్యుత్తమమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేయాలని సూచించారు.

నాణ్యమైన ఆహారం, మంచి సేవలు అందించడం ద్వారా వినియోగదారుల ఆదరణ పొందడంతో పాటు రెస్టారెంట్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని బోడే వెంకట్రామ్ ఆకాంక్షించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తుమ్మలచర్ల హరీష్, మంచిగంటి రమేష్, గోరుముచ్చు వెంకట సాయి తదితరులు పాల్గొని రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story