Pedana: వినాయక చవితికి సిద్ధమైన బొజ్జ గణపయ్య విగ్రహాలు
Pedana: పెడనలో వినాయక చవితి వేడుకలకు భక్తులు సిద్ధమవుతుండగా, ముడిసరుకుల ధరల పెరుగుదల నేపథ్యంలో విగ్రహాల ధరలు పెరిగినా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
Pedana: వినాయక చవితికి సిద్ధమైన బొజ్జ గణపయ్య విగ్రహాలు
పెడన: రానున్న వినాయక చవితి పండగను ఘనంగా జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. గణనాథుడి విగ్రహాలు ఇప్పటికే సిద్ధం కాగా... అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.అలాగే, మండపాల ఏర్పాటు పనులు కూడా మొదలుపెట్టారు.
అయితే ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యాన ఈసారి విగ్రహాల ధరలు కూడా పెరిగినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ భక్తులు ఎక్కడా తగ్గకుండా మండపాల ఏర్పాటు,గణేష్ నవరాత్రిత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పెడన పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఏటా వేములవాడ గోవర్ధన్ (ఆర్ట్స్) ఆధ్వర్యంలో వినాయకుని బొజ్జ గణపయ్య విగ్రహాలను తయారుచేస్తారు.
గత మూడు నెలలుగా తయారీలో నిమగ్నం కాగా...విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతూ అమ్మకం పై దృష్టి సారిస్తున్నారు.
Next Story




