Kanchikacherla: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేళ రక్తదానం, హెల్మెట్ల పంపిణీ!

Kanchikacherla: కంచికచర్లలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి హెల్మెట్లు అందజేసిన విప్ తంగిరాల సౌమ్య.

Naresh, Nandigama
Published on: 30 Aug 2026 12:20 PM IST
Kanchikacherla
X

Kanchikacherla: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేళ రక్తదానం, హెల్మెట్ల పంపిణీ!

Kanchikacherla: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కంచికచర్ల టౌన్‌లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రక్తదానం అనేది ఒక మహోన్నతమైన సేవా కార్యక్రమమని, మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ఆపదలో ఉన్న ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.

స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రత్యేకంగా అభినందించారు. యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

అనంతరం రక్తదానం చేసిన వారికి రక్తదాన సర్టిఫికెట్లను అందజేశారు. అంతేకాకుండా రక్తదాతల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహన ప్రయాణాల్లో ప్రమాదాల నివారణకు హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడటంతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది.

“రక్తాన్ని దానం చేయండి.. నిండు ప్రాణాన్ని నిలబెట్టండి” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కోరారు. అదే విధంగా ద్విచక్ర వాహనదారులు తమ ప్రాణ రక్షణ కోసం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

ప్రజా సంక్షేమం, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల భాగస్వామ్యంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కూటమి నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగంటి వెంకట సత్యనారాయణ బాబు,కూటమి నాయకులు, కార్యకర్తలు, రక్తదాతలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story