Nandigama: పెట్రోల్ బంక్ ఉద్యోగి హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు!

Nandigama: పరిటాల హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఉద్యోగి ఆరీఫ్ హత్య, దోపిడీ కేసును 48 గంటల్లో చేధించిన కంచికచర్ల పోలీసులు. ఆరుగురు నిందితుల అరెస్ట్.

Naresh, Nandigama
Published on: 10 Sept 2026 7:31 PM IST
Nandigama
X

Nandigama: పెట్రోల్ బంక్ ఉద్యోగి హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు!

Nandigama: కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారులో హెచ్ పీ (HP) పెట్రోల్ బంక్ లో తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు నెంబర్ ప్లేట్లు కలిగిన కారులో వచ్చి పెట్రోల్ బంక్ సయ్యద్ ఆరీఫ్ (30) డ్యూటీలో ఉన్న ఉద్యోగిని డబ్బులు కావాలి కార్డు స్వైప్ చేస్తారా అని డబ్బులు ఆశ చూపించి.

మోసపూరితంగా వ్యవహరించారు ఆరిఫ్ డబ్బులు లెక్కేస్తుండగా ఒక్కసారిగా డబ్బులు,స్వైప్ మిషన్ లాక్కొని కారును వేగంగా పోనిచ్చారు. బాధితుడు ఆరిఫ్ కారుని ఆపాలని పట్టుకోగా 150 మీటర్లు వరకు బంక్ ఉద్యోగిని ఈడ్చుకుంటూ వెళ్లారు ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరిఫ్ మృతి చెందాడని డి.సి.పిలక్ష్మీ నారాయణ తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కంచికచర్ల పోలీసులు ప్రత్యేక బృందాలతో సిసి ఫుటేజ్ సహాయంతో నిందితుల కదలికను గుర్తించి చెడు వ్యసనాలకి అలవాటు పడిన గుంటూరు జిల్లా, సత్తెనపల్లి, నర్సారావు పేటకు చెందిన 6గురు వ్యక్తులను పట్టుకున్నారు నిందితుల వద్ద నుండి స్వైప్ మిషన్,నేరానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకొని ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టుకి హాజరు పరుస్తున్నట్లుగా డిసిపి లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story