Nandigama: సైబర్ నేరాలపై అలర్ట్.. అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సౌమ్య నందిగామ పోలీస్ స్టేషన్ ఆవరణలో సైబర్ నేరాల అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించారు.

Naresh, Nandigama
Published on: 8 July 2026 1:27 PM IST
Nandigama
X

Nandigama: సైబర్ నేరాలపై అలర్ట్.. అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నందిగామ: నందిగామ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంకుడు గుంటను నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీమతి తంగిరాల సౌమ్య ప్రారంభించారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని కూడా ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని లింకులు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ , నందిగామ ఏసీపీ శ్రీ చి. శ్రీనివాసరావు , నందిగామ టౌన్ సీఐ పి. శ్రీను , ఎస్సైలు మోహన్ రావు, సూర్య వంశీ, మహిళా ఎస్ ఐ మహిత తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story