Nandigama: గుడిమెట్ల కృష్ణా నదిపై అనుమతి లేని బల్లకట్టు ప్రయాణాలు
Nandigama: చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణా నదిపై అనుమతి లేకుండా బల్లకట్టు నిర్వహణ. ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి, ప్రయాణికుల ప్రాణాలతో నిర్వాహకుల చెలగాటం.
Nandigama: గుడిమెట్ల కృష్ణా నదిపై అనుమతి లేని బల్లకట్టు ప్రయాణాలు
నందిగామ: కృష్ణా నదిపై అనుమతులు లేని బల్లకట్టు ప్రయాణాలు తక్షణమే నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. బల్లకట్టు నిర్వహణకు పలు నిబంధనలు కొన్నిషరతులతో జిల్లా ప్రజా పరిషత్ ఆధ్వర్యం లో వేలం పాట నిర్వహించిన తరువాత మాత్రమే కృష్ణా నదిపై బల్లకట్టు నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
అయితే ఈ నిబంధనలన్నీ ఉల్లంఘిస్తూ చందర్లపాడు మండలం గుడిమెట్ల కృష్ణా నదిపై అనుమతులు లేకుండా బల్లకట్టు యదేచ్చగా రాకపోకలు సాగిస్తున్నారు. ఏమాత్రం అనుమతులు లేకుండా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టడమే కాకుండా ప్రయాణికులకు రక్షణ చర్యలు చేపట్టకుండానే అవలీలలుగా నదులు దాటిస్తున్నారు. గుడిమెట్ల గ్రామ కృష్ణా నదిపై అనుమతి లేకుండా బల్లకట్టు ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
అనుమతి లేకుండా కృష్ణా నదిపై బల్లకట్టు నిర్వహిస్తూ దాని మీద వచ్చే అక్రమ సంపాదనతో జేబులు నింపుకుంటున్నారు బల్లకట్టు నిర్వాహకులు. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం నుండి గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం పుట్లగూడెం వరకు కృష్ణా నదిపై బల్లకట్టు తిప్పేందుకు జిల్లా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వేలంపాట నిర్వహిస్తారు.
అయితే ఈ సంవత్సరం మార్చి నెలతో వేలంపాట గడువు ముగిసినప్పటికీ అధికార పార్టీ నాయకుల అండతో బల్లకట్టు నిర్వాహకులు రెచ్చిపోయి వేలంపాట నిర్వహించనీకుండా అనుమతి లేకుండా కృష్ణా నదిపై బల్లకట్టు నిర్వహిస్తూ కోట్ల రూపాయల దండుకుంటున్నారు.
జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో కృష్ణా నదిపై బల్లకట్టు నిర్వహణకు వేలంపాట ముగిసి నెలలు గడుస్తున్న ఇప్పటివరకు అధికారులు వేలంపాట నిర్వహించలేదు దీంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది.




