Nandigama: కంచికచర్లలో బీజేపీ సన్నాహక సమావేశం ఎన్నికలకు పిలుపు!

Nandigama: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై నందిగామ కంచికచర్లలో బీజేపీ సమీక్ష: బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి పిలుపు.

Naresh, Nandigama
Published on: 1 Sept 2026 4:09 PM IST
Nandigama
X

Nandigama: కంచికచర్లలో బీజేపీ సన్నాహక సమావేశం ఎన్నికలకు పిలుపు!

Nandigama: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సిద్దం చేస్తున్న భారతీయ జనతా పార్టీ. కంచికచర్ల మండల బీజేపీ పార్టీ అధ్యక్షతణ సమావేశం నిర్వహించారు. బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని గ్రామ గ్రామాన పార్టీ కార్యక్రమాలు‌ నిర్వహించాలని, భారతీయ జనతా పార్టీ లోని 5 మార్చా కమిటీలను సంస్థగతంగా నిర్మాణం చేయాలని.

బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని. మన ఊరు మన జెండా దిశగా ప్రతి పల్లెలోనూ భారతీయ జనతా పార్టీ జండా ఎగరవేసే దిశగా కృషి చేయాలని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు కాలవ మహేష్ బాబు, ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మార్చ జనరల్ సెక్రటరీ తొర్లకొండ సీతారామయ్య, ఎస్సీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వాడపల్లి విజయబాబు, మండల జనరల్ సెక్రెటరీ చెరుకుమల నాగరాజు, తిరుపతి పార్లమెంట్ బిజెపి ప్రచారక్ బోనం రామిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story