Nandigama: నందిగామ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి సౌమ్య!
Nandigama: నందిగామ మున్సిపల్ ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలని హెచ్చరిక.
Nandigama: నందిగామ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి సౌమ్య!
Nandigama: నందిగామలో మున్సిపాలిటీ ఎన్నికలు కీలక ఘట్టంగా మారబోతున్నాయని అందుకు పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే సమిష్టిగా సిద్ధం కావాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు.
కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలని నాయకులను ఉద్దేశించి పలు కీలక సూచనలు చేశారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. కొంతమంది నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని పార్టీ నుంచి తొలగించడం జరుగుతుందని అన్నారు.
పార్టీలో పదవులు రాలేదని, టికెట్ దక్కలేదని కొంత మంది నాయకులు కార్యకర్తలు నిరుత్సాహంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అలాగే ప్రజల్లో కూటమి ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అలాంటి వారిపై పార్టీ క్రమశిక్షణచర్యలు ఉంటాయని వెల్లడించారు పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.
అనంతరం కూటమి పాలన నచ్చి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్లు పలువురు వ్యక్తులు టిడిపి లో చేరారు వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఏ నమ్మకంతో అయితే తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్లందరికీ సముచిత న్యాయం కల్పిస్తామని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.




