Kanuru: నూతన విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్

Kanuru: కానూరులో రూ.26 లక్షలతో నిర్మించిన నూతన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రకటన.

Ramana, Penamaluru
Published on: 27 Aug 2026 10:55 AM IST
Kanuru
X

Kanuru: నూతన విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్

Kanuru: కానూరులో నూతన విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ప్రజలకు మరింత చేరువులో ఉండాలని నూతన విలేజ్ క్లినిక్ లు ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క విలేజ్ హెల్త్ క్లినిక్ కొరకు 26 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తి అసంతృప్తి గా నిర్మాణం చేసి వదిలేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు విలేజ్ హెల్త్ క్లినిక్లు పీఎం అభయాన్ క్రింద ప్రారంభించడం జరిగింది. అభివృద్ధిలో భాగంగా తాడిగడప మున్సిపాలిటీలో యమ్ పథకం కింద సుమారుగా 55 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది.

తాడిగడప పోరంకి కానూరు యనమలకుదురు లో ఉన్నటువంటి రుబ్బిస్ రోడ్లన్నిటిని సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది.

డ్రైనేజీ పనుల నిమిత్తం యాభై కోట్లను కేటాయించి త్వరలో టెండర్లు వేయడం జరుగుతుంది. రానున్న ఒకటిన్నర సంవత్సర కాలంలో రోడ్లు డ్రైనేజీలు మరియు మంచినీటి ప్రాజెక్టులు సాంక్షన్ చేపిస్తాను అని తెలిపిన బోడె ప్రసాద్.

ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు - బోడె ప్రసాద్.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story