Tadigadapa: యణమలకుదురులో పేదలకు ఉచితంగా తోపుడు బండ్లు: ఎమ్మెల్యే బోడె ప్రసాద్
Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీ యణమలకుదురులో ఆనంతనేని ఆజాద్ అందజేసిన 10 తోపుడు బండ్లను పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
Tadigadapa: యణమలకుదురులో పేదలకు ఉచితంగా తోపుడు బండ్లు: ఎమ్మెల్యే బోడె ప్రసాద్
Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీ యణమలకుదురులో పేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించే లక్ష్యంతో ఆనంతనేని ఆజాద్ గారు ఉచితంగా 10 తోపుడు బండ్లను అందజేశారు.
ఈ కార్యక్రమానికి పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వయంగా లబ్ధిదారులకు తోపుడు బండ్లను అందజేశారు...
పేదలకు ఒకసారి సహాయం చేయడం కంటే… వారి కుటుంబానికి నిరంతర ఆదాయం వచ్చేలా ఉపాధి కల్పించడమే గొప్ప సేవ అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు పేర్కొన్నారు.
P4 స్ఫూర్తితో పేద కుటుంబాలను స్వయం సమృద్ధి వైపు నడిపించేందుకు ముందుకు వచ్చిన ఆనంతనేని ఆజాద్ గారి సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
యణమలకుదురు అభివృద్ధిలోనూ కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. గతంలో నిర్మించిన సుమారు 75–80 సిమెంట్ రోడ్లతో గ్రామ రూపురేఖలు మారగా,ప్రస్తుతం కృష్ణా నది నీటిని వినియోగించి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు దాదాపు ₹1.5 కోట్లతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
పేదలకు ఉపాధి – టీడీపీ లక్ష్యం
ప్రజలకు అభివృద్ధి – కూటమి ప్రభుత్వ ధ్యేయం
ప్రతి కుటుంబం స్వావలంబన – P4 సంకల్పం
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.




