Nuzvid: బీసీలకు రాజకీయ అవకాశాలు పెంచిన ప్రభుత్వం మంత్రి కొలుసు పార్థసారధి!
Nuzvid: నూజివీడులో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొలుసు పార్థసారధి. బీసీలకు నిర్ణయాధికారం, రాజకీయ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడి.
Nuzvid: బీసీలకు రాజకీయ అవకాశాలు పెంచిన ప్రభుత్వం మంత్రి కొలుసు పార్థసారధి!
Nuzvid: బీసీ రిజర్వేషన్లతో బీసీలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించడంతో పాటు, వేలాది మందికి రాజకీయ అవకాశాలు మెరుగవుతాయని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. నూజివీడు పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నాలుగు మండలాల్లోని 84 మంది లబ్ధిదారులకు 44 లక్షల రూపాయల చెక్కులను అందించారు.
అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించి.. సంబంధిత అధికారులలో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. 1995లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బీసీల రిజర్వేషన్లను 20 శాతం నుంచి 34 శాతానికి పెంచారని గుర్తుచేశారు. బీసీలను మోసం చేసిందే వైసీపీ నేత జగన్ అని మంత్రి కొలుసు పార్థసారధి విమర్షించారు.
Next Story




