Uyyuru: ఉయ్యూరులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు!
Uyyuru: ఉయ్యూరులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు. అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహణ, పాల్గొన్న ప్రముఖులు.
Uyyuru: ఉయ్యూరులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు!
Uyyuru: మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉయ్యూరులో ఆయన అభిమానులు ఘనంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఉయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, చిరంజీవిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
రక్తదానం ద్వారా అత్యవసర సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస విద్యా సంస్థల అధినేత పరుచూరి శ్రీనివాసరావు, మాక్స్ హాస్పిటల్ డాక్టర్ కరీం, తెలుగుదేశం పార్టీ నాయకులు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మర్రి శివ ప్రతాప్, మర్రి ప్రవీణ్ బాబు, తిరుమల శెట్టి మూర్తి, కోనపరెడ్డి సాయి, బ్యాంకు సత్యా, రేపల్లె వరుణ్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అభిమానులు చేపట్టిన సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.




