Pamarru: అనిల్ కుమార్ వ్యాఖ్యలపై పామర్రు ఎమ్మెల్యే వర్ల ఫైర్
Pamarru: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత కైలే అనిల్ కుమార్ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తీవ్రంగా స్పందించారు.
Pamarru: అనిల్ కుమార్ వ్యాఖ్యలపై పామర్రు ఎమ్మెల్యే వర్ల ఫైర్
Pamarru: అనిల్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే వర్ల. స్వయాన ప్రధానమంత్రి పొదుపు చర్యలు పాటించండి అన్నారు అంటే ఏదో జరుగుతుంది అని అర్థం. రాజకీయాలకు అతీతంగా ఒక భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి మాటను గౌరవించాలని కోరారు. పరిస్థితులు ఎలా ఉన్నా మాకు రాజకీయాలే ముఖ్యమైనట్టు కొన్ని పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసనలు తెలియ చేయవచ్చు ఆ హక్కు రాజ్యాంగం వారికి కల్పించింది.
సున్నితమైన వంగవీటి మోహన రంగ విషయాన్ని రాజకీయాలకు వాడుకుంటాం సిగ్గుచేటు అన్నారు. ఏటువంటి కార్యక్రమాలు చేస్తే కైలే అనిల్ కుమార్ కు సీటు వచ్చిందో అది నేను మాట్లాడనని అన్నారు. నోటికొచ్చినట్లు ఏది చెబితే అది నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు అనిల్ కుమార్ కు హితవు పలికారు. అడుగడుగునా తనపై అబాండాలు వేస్తున్నారు అంటే ప్రజా సేవలో తాను ముందుకు దూసుకుపోతున్నానని అర్థమన్నారు. ప్రతిపక్ష నాయకులు తనకు మంచి సర్టిఫికెట్ జారీ చేస్తున్నారన్నారు.
తాను నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధిని చూసి విపక్షాలు పోస్తున్నాయన్నారు. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసిన ఎదుర్కోవడానికి తన సిద్ధంగా ఉన్నాను అన్నారు. మేడూరు గ్రామంలో వరచెరువుని ఊదేస్తున్న వైకాపా నాయకులను అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసుల తల పగలగొట్టిన నాయకులు ఎవరో ప్రజలందరికీ తెలుసు అన్నారు. అడ్డాడ ఊర చెరువుని ఉదేస్తున్న వైకాపా అడ్డ గాడిదను అడ్డుకోవడానికి తాను వెళితే పీక కోస్తానని హెచ్చరించాడు.
వారు మట్టి దాహానికి గంగానమ్మ విగ్రహాన్ని కూడా బయటపెట్టేశారు. రోజుకు అరకోటి అంటూ ఆరోపణలు చేస్తున్న అనిల్ అది నిరూపించాలని కోరారు. తనకు ఆ అరకోటి ఇచ్చి మిగిలినవి అనిల్ నే తీసుకోమన్నారు. ఆ డబ్బుతో పి ఫోర్ కార్యక్రమాలు తాను నిర్వహిస్తానని కూడా తెలిపారు. ఊసరవల్లి రంగులు మార్చినట్టు కైలే అనిల్ కుమార్ తనకి అనుగుణంగా రంగులు మారుస్తాడు అన్నారు. రూపాయి ఖర్చు పెట్టాను గెలుస్తాను అనుకున్నావు కానీ ప్రజలు అభివృద్ధి చేస్తే మాత్రమే గెలిపిస్తారని గ్రహించలేకపోయామని తెలిపారు.
రాష్ట్రంలో పామర్రు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందని.. అనిల్ డబ్బుకు దగ్గరయ్యాడు కానీ రాజకీయంగా ప్రజలకు దూరమయ్యాడు అని ఎద్దేవా చేశారు.




