Tadigadapa: కానూరులో ఫస్ట్‌క్రై ఇంటెల్లిటోట్స్ ప్రీ స్కూల్ ప్రారంభం
Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీ కానూరులో ఫస్ట్‌క్రై ఇంటెల్లిటోట్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్‌ను ఘనంగా ప్రారంభించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్.
Tadigadapa: కానూరులో ఫస్ట్‌క్రై ఇంటెల్లిటోట్స్ ప్రీ స్కూల్ ప్రారంభం
తాడిగడప: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫస్ట్‌క్రై ఇంటెల్లిటోట్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్*ను పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు *శ్రీ బోడే ప్రసాద్ గారు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు, వారి సృజనాత్మకత,ఆత్మవిశ్వాసం, సామాజిక నైపుణ్యాలను పెంపొందించేలా ఆనందదాయకమైన అభ్యాస వాతావరణాన్ని అందించడం అభినందనీయమన్నారు, చిన్ననాటి నుంచే విద్యతో పాటు సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఫస్ట్‌క్రై ఫ్రాంచైజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటెల్లిటోట్స్ ప్రీ స్కూల్ యాజమాన్యం శ్రీమతి మావులూరి తేజస్విని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ,విద్యారంగంలో నూతన ప్రమాణాలను నెలకొల్పుతూ ఈ విద్యాసంస్థ మంచి పేరు సంపాదించాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీ అనుమోలు ప్రభాకర్ రావు గారు,అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు శ్రీ ధనేకుల మురళీమోహన్ రావు గారు,యనమలకుదురు శివాలయం అభివృద్ధి ప్రదాత శ్రీ సంగా నరసింహారావు గారు,తెలుగుదేశం పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.




