Kankipadu: రైతు అవగాహన సదస్సు - ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
Kankipadu: కంకిపాడులో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు దిశానిర్దేశం చేశారు.
Kankipadu: రైతు అవగాహన సదస్సు - ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
కంకిపాడు: కంకిపాడు లోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యంత్ర ప్రదర్శన మరియు రైతు అవగాహన సదస్సులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు,జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గారు,స్థానిక ప్రజాప్రతినిధులు,మార్కెట్ యార్డ్ చైర్మన్లల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గారు,జిల్లా కలెక్టర్ గారు ప్రదర్శనలో ఉంచిన యంత్ర పరికరాలు,వివిధ రకాల స్టాల్స్ ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు...
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ...
సాంప్రదాయ వరి సాగు వల్ల ఎదురవుతున్న నష్టాలను,ప్రత్యామ్నాయ పంటల ఆవశ్యకతను వివరించారు,రసాయనాల వాడకం,కలుషిత ఆహారం వల్ల నేడు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి,విదేశాల్లో నేచురల్ ఫార్మింగ్ ఉత్పత్తులకు విపరీతమైన గిరాకీ ఉంది, స్థానిక రైతులు కూడా ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలన్నారు.
ఎల్ నినో ప్రభావంతో జలాశయాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది,వేలకు వేలు పెట్టుబడులు పెట్టి వరి సాగు చేయడం,చివరకు తుఫానులు,తేమ సమస్యల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పామాయిల్,అంతర పంటల సాగు మేలు, మెరక భూముల్లో రైతులు వరికి బదులుగా పామాయిల్ తోటల సాగు చేపట్టాలని సూచించారు,పామాయిల్ తోటల్లో ప్రారంభంలో మినుము,పెరిగిన తర్వాత అంతర పంటలు వేయడం ద్వారా నిరంతర ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు.
యూరియా వాడకాన్ని తగ్గించి,ఆ ఖర్చుతో రైతులంతా తప్పనిసరిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గారు మాట్లాడుతూ...
రైతులు ఆధునిక దృక్పథంతో ఆలోచించి, తక్కువ విస్తీర్ణంలో ఏడాదికి రూ.4 నుంచి 5 లక్షల వరకు స్థిరమైన ఆదాయం సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ లు మరియు వ్యవసాయ శాఖ అధికారులు,పెద్ద సంఖ్యలో రైతులు,తదితరులు పాల్గొన్నారు.




