Kanchikacherla: పనిభారం తగ్గించాలని కంచికచర్లలో వైద్యధికారికి వినతి!

Kanchikacherla: కంచికచర్లలో NLEP సర్వేలో ఓటీపీ విధానం రద్దు చేయాలని హెల్త్ సెక్రటరీల నిరసన.. మెడికల్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేసిన AITUC నాయకులు.

Naresh, Nandigama
Published on: 11 Sept 2026 6:38 PM IST
Kanchikacherla
X

Kanchikacherla: పనిభారం తగ్గించాలని కంచికచర్లలో వైద్యధికారికి వినతి!

Kanchikacherla: కంచికచర్ల పట్టణంలో ఎన్ఎల్ఈపీలో (NLEP) సర్వేలో ఓటీపీ విధానం రద్దు చేసి,పని భారం తగ్గించాలి.. ఏపీ గ్రామ వార్డ్ సచివాలయ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్.

NLEP సర్వేల్లో ఓటిపి (OTP) విధానం లేదని, ఇప్పుడు కొత్తగా OTPలు తీసుకోవడం వల్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని, ఇప్పటికే పని భారంతో అల్లాడుతున్న హెల్త్ సెక్రటరీలకు మరింత భారం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓటిపి విధానాన్ని తీసుకురావడం చాలా బాధాకరమని తక్షణమే NLEPసర్వేలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని సచివాలయ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ ఏఐటీయూసీ సభ్యులు గోపిక, రోజా, కమల, రాణి,ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కంచికచర్ల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వసుందర కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా హెల్త్ సెక్రటరీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ హెల్త్ సెక్రటరీ పని భారంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పని గంటల విధానం లేక నిరంతరం ప్రజలకు పథకాలు చేరవేస్తూ ఆరోగ్య భద్రత విషయాలు పాటిస్తూ వర్కు చేస్తున్నారని అలాంటి వారిపై మరింత భారం పెంచే విధంగా ఎన్ఎల్వీపీలో ఓటీపీ విధానాన్ని తీసుకురావడం ఇంకా పని ఒత్తిడికి గురి చేయడమే అన్నారు.

పెన్షన్ రోజునే వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం వల్ల ఫీల్డ్‌లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అన్నారు...

అదేవిధంగా ఫీల్డ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు...

ఒకపక్క మెడికల్ డిపార్ట్మెంటు మరో పక్క జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారుల ఆదేశాలు ఇలా ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురవుతూ కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్నామన్నారు...

అలాంటి వారిపై ప్రభుత్వం ఇంకా పని భారం రుద్దడం వల్ల పనిచేయలేకపోతున్నామని తక్షణమే ఓటీపీ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు...

రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు నిర్వహిస్తామని, అధికారులను కలుస్తామని వారు అన్నారు...

కార్యక్రమంలో సచివాలయ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ నాయకులు విజయ కుమారి, సుధారాణి, శ్రీలత, నాగమణి ప్రభావతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు...

Naresh, Nandigama

Naresh, Nandigama