Gudivada: గుడివాడలో 100% మున్సిపల్ ఎన్నికలు వెనక్కి తగ్గేదే లేదన్న టీడీపీ!
Gudivada: గుడివాడలో మున్సిపల్ ఎన్నికలు వంద శాతం జరుగుతాయని టీడీపీ నేతల స్పష్టం. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నేతృత్వంలో కోర్టు అడ్డంకుల తొలగింపునకు చర్యలు.
Gudivada: గుడివాడలో 100% మున్సిపల్ ఎన్నికలు వెనక్కి తగ్గేదే లేదన్న టీడీపీ!
Gudivada: గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ మున్సిపల్ ఎన్నికలు, పట్టణ అభివృద్ధి, నిలిచిపోయిన నిధులపై పట్టణ టిడిపి అధ్యక్షులు పండ్రాజు సాంబశివరావు, సీనియర్ నాయకులు లింగం ప్రసాద్, కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, పార్టీ నాయకులు మహమ్మద్ రఫీ, గడ్డం ప్రకాష్ దాస్, తదితర నేతలు మాట్లాడారు.
గుడివాడలో మున్సిపల్ ఎన్నికలు వంద శాతం జరుగుతాయని, ఎన్నికలకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఎన్నికలకు ఉన్న అడ్డంకులను తొలగించి ఎన్నికలు జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి రాజకీయాలు వారు చూసుకుందామని, కానీ ఎన్నికలు జరిగే వరకు గుడివాడ అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల అభివృద్ధి విషయంలో రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలని కోరారు.ఎన్నికలు లేకపోవడంతో గుడివాడకు రావాల్సిన అభివృద్ధి నిధులు నిలిచిపోతున్నాయని నాయకులు తెలిపారు.
ఈ పరిస్థితి ఇకపై కొనసాగకూడదని, గుడివాడకు రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి అభివృద్ధి పనులు వేగవంతం కావాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృషి చేస్తున్నారని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఉన్న కోర్టు కేసులు, ఇతర అడ్డంకుల పరిష్కారంపై దృష్టి సారించడంతో పాటు, ఎన్నికలు లేకపోవడం వల్ల గుడివాడకు జరుగుతున్న నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే రాము తీసుకువెళ్లారని చెప్పారు.
విలీన గ్రామాలను కలుపుకుని 48 వార్డులతో మున్సిపల్ వ్యవస్థ ముందుకు వెళితే గుడివాడ మరింత అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన, మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని నాయకులు అన్నారు.
గుడివాడ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి.. మున్సిపల్ ఎన్నికలు 100 శాతం జరుగుతాయనీ, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడ అభివృద్ధికి కొత్త దిశ చూపిస్తాం అని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు.
మార్పు లేని గుడివాడను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతూ ఎన్నికల్లో పోటీ చేసిన వెనిగండ్ల రామును ప్రజలు ఆశీర్వదించారని తెలిపారు. అన్న ఎన్టీఆర్ పురిటిగడ్డ గుడివాడను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఎమ్మెల్యే రాము నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు.
రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోందని అన్నారు. టీడీపీకి మేనిఫెస్టో పవిత్ర గ్రంథంతో సమానమని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తమ పార్టీ విధానమని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. వారి స్ఫూర్తితో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ అభివృద్ధికి పనిచేస్తున్నారని అన్నారు.
మీడియా సమావేశంలో సీనియర్ టిడిపి నాయకులువికంచర్ల సుధాకర్, పంచమర్తి శ్రీనివాసరావు, పెద్దు వీరభద్రరావు, షేక్ జానీ, పోలాసి ఉమా,సయ్యద్ జబీన్, కోడూరి ప్రభు,మల్లికా బేగం, ఆస్మా, తదితర నాయకులు పాల్గొన్నారు.




