Vuyyuru: ఉయ్యూరు ఆసుపత్రిలో డయేరియా బాధితులను పరామర్శించిన నేతలు
Vuyyuru: డయేరియా బాధితులను పరామర్శించిన రాజేంద్రప్రసాద్, బోడే ప్రసాద్
Vuyyuru: ఉయ్యూరు ఆసుపత్రిలో డయేరియా బాధితులను పరామర్శించిన నేతలు
Vuyyuru: ఉయ్యూరు టౌన్ లోని 5,7 వార్డుల్లో మరియు మండలంలోని ముదునూరు, కడవకొల్లు, బోళ్ల పాడు గ్రామాలకు చెందిన కొంతమంది డయేరియా సమస్యలతో ఉయ్యూరు ప్రభుత్వ హాస్పిటల్లో చేరి వైద్యం చేయించుకుంటున్న సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారితో పాటుగా హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చిన రాజేంద్రప్రసాద్ గారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు మాట్లాడుతూ గత మూడు రోజులుగా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు సన్నద్ధం చేస్తూ, బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉండాలని ఆదేశించామని, వాటర్ శాంపిల్స్ కూడా టెస్టింగ్ కోసం పంపించడం జరిగిందని, వీళ్ళందరు కూడా రకరకాల సమస్యలతో హాస్పటల్లో జాయిన్ అవడం జరిగిందని, ప్రభుత్వం బాధ్యతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.




