Kankipadu: కంకిపాడు ఆసుపత్రిలో డయేరియా బాధితులకు పరామర్శ!

Kankipadu: కంకిపాడు ప్రభుత్వాసుపత్రిలో డయేరియా బాధితులను దేవభక్తుని చక్రవర్తి పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేశారు.

Ramana, Penamaluru
Published on: 28 Aug 2026 2:29 PM IST
Kankipadu
X

Kankipadu: కంకిపాడు ఆసుపత్రిలో డయేరియా బాధితులకు పరామర్శ!

Kankipadu: కృష్ణా జిల్లా కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను పరామర్శించిన పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి.బాధితుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని చక్రవర్తి.వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

దేవభక్తుని చక్రవర్తి కామెంట్స్, కంకిపాడు, ఉయ్యూరులో డయేరియా విజృంభిస్తుంది.ఉయ్యూరులో డయేరియా లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు.కంకిపాడులో గడిచిన నాలుగు రోజుల్లో 40 మంది డయేరియా బారిన పడ్డారు.ప్రస్తుతం 15 మంది బాధితులు ట్రీట్మెంట్ పొందుతున్నారు.అధికారులు పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.

గ్రామాల్లో RO ప్లాంట్లు మూతపడ్డాయి.బోర్ వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ లోకి వెళ్లి క్లోరినేషన్ అయ్యే పరిస్థితి లేదు.కృష్ణ జలాల నుంచి త్రాగునీరు తెస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారు.ముందు డయేరియా అదుపులోకి తీసుకురండి.పెనమలూరు నియోజకవర్గం పరిధిలో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్వీర్యంగా ఉన్నాయి.RO ప్లాంట్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు పునర్దించుకుంటే గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తాం అని డిమాండ్.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story