Penamaluru: మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం పెనమలూరు ఎమ్మెల్యే
Penamaluru: మున్సిపాలిటీ పరిధిలో రూ.80 లక్షలతో నిర్మించిన 3 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించిన పెనమలూరు ఎమ్మెల్యే ప్రసాద్. ఉచిత మందులు, రక్తపరీక్షలు లభ్యం.
Penamaluru: మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం పెనమలూరు ఎమ్మెల్యే
Penamaluru: తాడిగడప మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి,ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు అన్నారు.
యనమలకుదురు, కానూరు ప్రాంతాల్లో సుమారు రూ.80 లక్షలతో నిర్మించిన మూడు విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఎమ్మెల్యే గారు ప్రారంభించారు,అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు,అందుబాటులో ఉన్న మందులను పరిశీలించి,స్వయంగా వైద్య సేవలను కూడా పొందారు.
పేద ప్రజలకు వైద్యం మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ హెల్త్ క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు,గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన క్లినిక్‌లను పూర్తి చేసి,ఒక్కో క్లినిక్‌కు సుమారు రూ.26 లక్షలతో నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు,ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని,సుమారు 150 రకాల మందులతో పాటు అవసరమైన రక్త పరీక్షల సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు.




