Nandigama: కంచికచర్ల నివాసితులకు ఇళ్ల పట్టాలు జేసీకి బీజేపీ వినతి!
Nandigama: కంచికచర్లలో 22A భూముల్లోని వారికి జీవో 30 ద్వారా ఇళ్ల పట్టాలు, ఎన్‌ఓసీ జారీ చేయాలని ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియాకు బీజేపీ నాయకుల వినతి.
Nandigama: కంచికచర్ల నివాసితులకు ఇళ్ల పట్టాలు జేసీకి బీజేపీ వినతి!
Nandigama: కంచికచర్ల పట్టణంలో గత 70 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో ఇల్లు స్థలాలు కట్టుకొని నివాసముంటున్నారు. ఆ భూములు 22A జబితా లో ఉన్నావి -వాటికి-GO 30 ద్వారా ఇల్లు పట్టాలు జారిచేయవలసినదిగా కోరుచున్నాము.
వాటిపై ఎటువంటి అభ్యంతరాలు లేవని మా తరపున మీకు తెలియజేస్తున్నాము. గత 50 సంవత్సరాల క్రితం కంచికచర్ల కొన్ని కాలనీలు ప్రభుత్వం తరపున నుంచి ఇవ్వడం జరిగింది. వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా NOC జారిచేయివలననదిగా కోరుచున్నాము.
ఈ అర్జి పై రిపోర్ట్ తయారుచేసి లబ్ధిదారులకు త్వరగా న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ కి వినతి పత్రం అందజేసిన నాయకులు. భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పోరుగండి నరసింహారావు , కంచికచర్ల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కాలవ మహేష్ బాబు.




