Avanigadda: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నమోదు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

Avanigadda: ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వీడాలని గ్రామ సచివాలయాల తనిఖీలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆదేశించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 11 Sept 2026 3:39 PM IST
Avanigadda
X

Avanigadda: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నమోదు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

అవనిగడ్డ: ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తుల నమోదు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. శుక్రవారం అవనిగడ్డ శివారు లంకమ్మ మాన్యం, మండల పరిధిలోని అశ్వారావుపాలెం, మోదుమూడి గ్రామ సచివాలయాలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎన్టీఆర్ పింఛన్ భరోసా దరఖాస్తుల నమోదు ప్రక్రియ పరిశీలించారు.

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తుల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల సిబ్బంది బాధ్యతగా పని చేయాలని స్పష్టం చేశారు. దరఖాస్తుల నమోదులో ఏవైనా సందేహాలు, సాంకేతిక ఇబ్బందులు వస్తే తక్షణమే తహసీల్దార్, ఎంపీడీఓల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా గ్రామ సచివాలయాల ఉద్యోగులు బాధ్యతగా పని చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేయాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సూచించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు ఆయా కార్యాలయాల్లో సిబ్బంది హాజరు రిజిస్టరులు పరిశీలించారు. కార్యాలయానికి రాని వారిపై, వచ్చినా రిజిస్టరులో సంతకాలు చేయని వారిపై సాయిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు రిజిస్టర్, మూవ్ మెంట్ రిజిస్టర్ ఖచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళతానని సాయిబాబు హెచ్చరించారు. వారి వెంట తహసీల్దార్ బీ.అంకాలు, ఇంచార్జి ఎంపీడీఓ వనజ ఉన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.