Yanamalakuduru: పెనమలూరు పరిధిలో ఉరివేసుకున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజేష్!
Yanamalakuduru: కృష్ణా జిల్లా యనమలకుదురులో విషాదం. ఆర్థిక ఇబ్బందులతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజేష్ ఉరివేసుకుని ఆత్మహత్య.
Yanamalakuduru: పెనమలూరు పరిధిలో ఉరివేసుకున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజేష్!
Yanamalakuduru: యనమలకుదురులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక AR హెడ్ కానిస్టేబుల్ రాజేష్ (42) బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.
విజయవాడ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న రాజేష్.. యనమలకుదురులోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాజేష్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా సమాచారం. అయితే పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఇలా బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజేష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.




