Pedana: ganeshutsav.net ద్వారా వినాయక మండపాల అనుమతులు !
Pedana: గణేష్ మండపాల అనుమతులకు ఆన్లైన్ సింగిల్ విండో విధానం.. ganeshutsav.net ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పెడన ఎస్సై సత్యనారాయణ సూచన.
Pedana: ganeshutsav.net ద్వారా వినాయక మండపాల అనుమతులు !
Pedana: గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతుల కోసం ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ganeshutsav.net వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిందని పెడన ఎస్సై గంట్ల సత్యనారాయణ తెలిపారు. పెడన పరిధిలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారు.
ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు. అనుమతుల కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం పోలీసులు మండపం ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పరిశీలిస్తారని తెలిపారు.
నిబంధనలకు అనుగుణంగా ఉన్న మండపాలకు QR కోడ్‌తో కూడిన NOC జారీ చేస్తారని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవ నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై కోరారు.




