Penamaluru: బాధితులకు భరోసా రూ. 5.46 లక్షల CMRF LOC పత్రాల అందజేత!

Penamaluru: పెనమలూరులో ముగ్గురు బాధితులకు రూ.5.46 లక్షల CMRF LOC పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉందన్నారు.

Ramana, Penamaluru
Published on: 14 Aug 2026 5:20 PM IST
Penamaluru
X

Penamaluru: బాధితులకు భరోసా రూ. 5.46 లక్షల CMRF LOC పత్రాల అందజేత!

Penamaluru: పేద కుటుంబంలో అనారోగ్యం అంటే కేవలం ఆరోగ్య సమస్య కాదు ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి,అలాంటి వేళ “ప్రభుత్వం మాతో ఉంది” అనే నమ్మకాన్ని కల్పిస్తున్నది కూటమి ప్రభుత్వం అని పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు అన్నారు.

పోరంకి ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.5.46 లక్షల విలువైన LOC పత్రాలను ముగ్గురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

“పేద కుటుంబంలో అనారోగ్యం కారణంగా డబ్బులు లేక చికిత్స ఆగిపోకూడదు,ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం,సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవసరమైన వారికి వేగంగా సహాయం అందిస్తూ,కష్టకాలంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం,ప్రజల ప్రాణాలు,ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎప్పటికీ వెనక్కి తగ్గదు” అని తెలిపారు.

అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన వైసీపీ పాలనకు భిన్నంగా, కూటమి ప్రభుత్వం పేదల కష్టం వింటోంది. కన్నీరు తుడుస్తోంది.ఆపదలో అండగా నిలుస్తోంది.కష్టాల్లో ఉన్న కుటుంబానికి భరోసా, పేదల ఆరోగ్యానికి రక్షణ, ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం.

ప్రజల పక్షాన నిరంతరం అందుబాటులో ఉంటూ,ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు మరోసారి తన సేవా నిబద్ధతను చాటుకున్నారు.


Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story