Bhadrachalam: భద్రాచలంలో వైఎస్సార్ విగ్రహానికి ఘనంగా పాలాభిషేకం!

Bhadrachalam: వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కొల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Sept 2026 6:31 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో వైఎస్సార్ విగ్రహానికి ఘనంగా పాలాభిషేకం!

భద్రాచలం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని భద్రాచలం ఓల్డ్ మార్కెట్‌లోని వైఎస్ఆర్ విగ్రహానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కొల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వైఎస్ఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్ఆర్ చేసిన కృషిని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story