Bayyaram: బయ్యారం, గార్ల మండలాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గార్ల మండలాల్లో ఉత్సాహంగా వినాయక చవితి వేడుకలు. గంధంపల్లిలో 13 అడుగుల భారీ మట్టి విగ్రహం ఏర్పాటు, వర్షంలోనూ భక్తుల కోలాహలం.

NARASIMHARAO, BAYYARAM
Published on: 14 Sept 2026 3:03 PM IST
Bayyaram
X

Bayyaram: బయ్యారం, గార్ల మండలాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల _బయ్యారం మండలాలలో వర్షంలో తడుస్తూ పురవీధుల్లో ఊరేగింపుతో వినాయక విగ్రహ ప్రతిష్ట మండపాలలో ఏర్పాటు చేయడం జరిగింది.

గంధం పల్లి గ్రామంలో FYCC యూత్ ఆధ్వర్యంలో 13 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని మండపంలో వినాయక విగ్ర ప్రతిష్ట ఏర్పాటు చేయడం జరిగింది.

కొత్తపేట గ్రామంలో కొమురం భీం కాలనీవాసులు వర్షాన్ని లెక్కచేయకుండా పురవీధుల్లో మేళ తాళాలతో నృత్యాలతో గణపతి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి మండపంలో వినాయక విగ్ర ప్రతిష్ట చేశారు.

భక్తులు మాట్లాడుతూ భాద్రపద శుద్ధ చతుర్థిని పురస్కరించుకుని వినాయక చవితి పండుగను జరుపుకొనుటకు సిద్ధమయ్యామని అన్నారు, వీధి వీధినా, వాడ వాడనా తొండమునాయకుడు కొలువుదీరనున్నాడు. నెల రోజుల క్రితం నుంచే ప్రతిష్టాత్మక మండపాల నిర్వహణకు కమిటీలు సిద్ధం కాగా, పందిళ్ల అలంకరణలు, రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో బస్తీలు కొత్త శోభను సంతరించుకున్నా మనీ మార్కెట్లలో పత్రాలు, పండ్లు, మట్టి గణపతుల కొనుగోలుతో భక్తుల హడావుడి నెలకొంది . ముఖ్యంగా చిన్నారులు విగ్రహాల ఎంపిక నుంచి మండపాల అలంకరణ వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM