Khammam: వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ క్విజ్ పోటీలు ప్రారంభం!
Khammam: 15 నుంచి 29 ఏళ్ల యువత కోసం 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027' జాతీయ ఆన్‌లైన్ క్విజ్ పోటీలు ప్రారంభమయ్యాయి.
Khammam: వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ క్విజ్ పోటీలు ప్రారంభం!
ఖమ్మం: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ కేంద్ర ఖమ్మం ద్వారా ఈరోజు విలేకర్ సమావేశం నిర్వహించడం జరిగింది.
మై భారత్ కేంద్ర ఖమ్మం జిల్లా యువజన అధికారి యం. వెంకట్ రాంబాబు గారు మాట్లాడుతూ భారతదేశంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (VBYLD) 2027 ఒక ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ఆన్లైన్ క్విజ్ పోటీలు 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం, ప్రతిభావంతులైన యువతీ యువకులను గుర్తించి, 2047 నాటికి దేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనే 'వికసిత్ భారత్' లక్ష్యంలో వారిని భాగస్వాములను చేయడం.
తెలుగుతో పాటు దేశంలోని 22 అధికారిక భాషల్లో అందుబాటులో ఉన్న ఈ ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొని, ఐదు దశల ఎంపిక ప్రక్రియ (క్విజ్, వ్యాసరచన పోటీ, జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి రౌండ్లు) ద్వారా తుది విజేతలుగా నిలిచే యువతకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి డైలాగ్‌లో పాల్గొని, గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సమక్షంలో దేశాభివృద్ధిపై తమ సరికొత్త ఆలోచనలను (Ideas) ప్రెజెంట్ చేసే సువర్ణావకాశం లభిస్తుంది ఆసక్తి గల అభ్యర్థులు 30 సెప్టెంబర్ 2026 లోపు (mybharat.gov.in) వెబ్సైట్ లో ఉచితంగా రిజిస్టర్ చేసుకుని పాల్గొనవచ్చు.
ఈ కార్యక్రమంలో డా,, బనోత్ రెడ్డీ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అకౌంట్స్ ఆఫీసర్ కె. భాను చందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చరిత్ర, జాగృతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ షారుఖ్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.




