Kothagudem: కొత్తగూడెం శ్రీ కనకదుర్గా ఆలయంలో వైభవంగా వరలక్ష్మి వ్రతం

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీ కనకదుర్గా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రత మహోత్సవం శోభాయమానంగా జరిగింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 21 Aug 2026 3:45 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం శ్రీ కనకదుర్గా ఆలయంలో వైభవంగా వరలక్ష్మి వ్రతం

Kothagudem: కొత్తగూడెంలోని శ్రీ కనకదుర్గా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత మహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలు, ప్రత్యేక పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిష్ఠగా ఆచరించారు.

శ్రీ లక్ష్మీ అమ్మవారి దివ్య ప్రతిమను విశేషంగా అలంకరించి, కుంకుమార్చనలు నిర్వహించారు. వ్రత పూజలు ముగిసిన అనంతరం మహిళా భక్తులు కర్పూర హారతులు సమర్పించి, సర్వజన సుభిక్షం, కుటుంబ సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వరలక్ష్మి వ్రత మహోత్సవంలో పెద్ద సంఖ్యలో సుమంగళులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story