Julurupad: మండలంలో ఘనంగా వనమహోత్సవం.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు!
Julurupad: మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో ప్రజల భాగస్వామ్యంతో వనమహోత్సవం ఘనంగా నిర్వహించారు. విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
Julurupad: మండలంలో ఘనంగా వనమహోత్సవం.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు!
Julurupad: జూలూరుపాడు మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పాపకొల్లు–కొత్తూరు జూలూరుపాడు గ్రామ పంచాయతీల పరిధిలోని ఏవీన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి మండల పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీమతి శ్రీలత హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నాటిన మొక్కలను క్రమం తప్పకుండా పరిరక్షించి వాటిని వృక్షాలుగా పెంచాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి, ఎంపీఓ తులసీరామ్, ఏపీఓ రామారావు, టీఏ నాగమణి, ఎఫ్ఏ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




