Singareni: 13 నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘సింగరేణి భరోసా యాత్ర’!
Singareni: కేంద్ర ప్రభుత్వం సింగరేణికి తాడిచెర్ల-2 బొగ్గు గనిని కేటాయించిన నేపథ్యంలో ఈనెల 13, 14 తేదీల్లో కిషన్ రెడ్డి ‘సింగరేణి భరోసా యాత్ర’ చేపట్టనున్నారు.
Singareni: 13 నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘సింగరేణి భరోసా యాత్ర’!
సింగరేణి: కేంద్ర ప్రభుత్వం సింగరేణికి తాడిచెర్ల 2 బొగ్గు గనిని కేటాయించడంతో కార్మికుల ఆహ్వానం మేరకు చేపట్టనున్న యాత్ర,సింగరేణి భరోసా యాత్ర చేపట్టనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
41 వేలమంది సింగరేణి కార్మికులు, దాదాపు 30 వేలకు పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించేందుకు యాత్ర,ఈనెల 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు సాగనున్న కిషన్ రెడ్డి యాత్ర
మొదటి రోజు 13వ తేదీన కొత్తగూడెం నుంచి మణుగూరు, మణుగూరు నుంచి భూపాలపల్లికి యాత్ర,అన్నిచోట్ల కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం
రెండో రోజు 14న భూపాలపల్లి KTK 8 మైన్ వద్ద కార్మికులతో భేటీ కానున్న కేంద్ర మంత్రి,అక్కడి నుంచి తాడిచర్ల మైన్స్ ను సందర్శిస్తారు
గోదావరిఖని ఓపెన్ కాస్ట్ వద్ద కార్మికులతో ముఖాముఖి అక్కడి నుంచి శ్రీరాంపూర్ 3 మైన్స్ సందర్శనతో పాటు కార్మికులతో ఇంటరాక్షన్
చివరగా మంచిర్యాలలో సింగరేణి భరోసా యాత్ర ముగియనుంది.
ఈ రెండ్రోజుల పాటు సాగే యాత్రలో 4 జిల్లాల్లో 3 సభలు, 5 చోట్ల కార్మికులతో ముఖాముఖి, సమావేశాలు నిర్వహిస్తారు.




