Kothagudem: భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరు.. 25న చలో లేబర్ కార్యాలయం
Kothagudem: పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కారం కోసం మే 25న చలో లేబర్ ఆఫీస్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు గోపాలరావు తెలిపారు.
Kothagudem: భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరు.. 25న చలో లేబర్ కార్యాలయం
Bhadradri Kothagudem: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం(TUCI) ఆధ్వర్యంలో రాష్ట్ర లేబర్ కార్యాలయం ముందు జరుగు ధర్నా ను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు.
గురువారం మండలం కేంద్రం లో గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు 9వేల రూపాయల పెన్సన్స్ ఇవ్వాలని, పమాద & ఇతర పథకాల అమలులో ప్రైవేట్ ఏజెన్సీలు రెన్యువల్ చేసే పద్ధతి నిలిపివేయాలనీ, ప్రైవేట్ సంస్థలతో నిర్వహించే ఆరోగ్య పరీక్షలను రద్దు చేయాలనీ ఈఎస్ఐ ఆసుపత్రి సౌకర్యాన్ని కల్పించాలనీ, పెండింగ్ క్లెయిమలను వెంటనే పరిష్కరించాలనీ, రైతాంగం మాదిరి భవన నిర్మాణ కార్మికులకు సహజ మరణానికి 5 లక్షలు ప్రకటించాలనీ, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలనీ, లేబర్ అడ్డాలలో వేసవి కాలంలో కార్మికులకు షెల్టర్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలనీ తదితర డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ జరుగుతున్న ప్రదర్శన, ధర్నా కార్యక్రమం లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు ఏదులాపురం రాజు, పొరండ్ల కనకమ్మ, రాజమ్మ, నాగరత్నమ్మ, లలిత, భవాని, పట్టా ప్రసాద్, నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు.




