Kothagudem: కొత్తగూడెం విజయ విఘ్నేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

Kothagudem: కొత్తగూడెం శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 25 July 2026 8:10 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం విజయ విఘ్నేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

Kothagudem: కొత్తగూడెం పట్టణంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో 25.07.2026 శనివారం రోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం 6:00 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం అనంతరం,స్వామి వార్ల దర్శనం కొరకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు.

విశిష్ట అతిథిగా కొత్తగూడెం జిల్లా రెవిన్యూ అధికారి శ్రీమతి k.పద్మావతి స్వామి వార్లు మరియు శ్రీ దుర్గా అమ్మావారిని దర్శించుకొని పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తదుపరి ఈఓ గారి ఆధ్వర్యంలో అర్చక స్వాములు మరియు దేవాలయ సిబ్బందిచే తీర్థ ప్రసాదములు భక్తులకు అందిచడం జరిగిందని శ్రీమతి ఎన్. రజని కుమారి ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story