Kothagudem: ఒకే చోట 70 కంపెనీలు.. ఖమ్మంలో రేపే మెగా జాబ్ మేళా!
Kothagudem: ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగులకు అలర్ట్! మే 4వ తేదీన ఖమ్మం ఎస్.ఆర్. గార్డెన్స్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
Kothagudem: ఒకే చోట 70 కంపెనీలు.. ఖమ్మంలో రేపే మెగా జాబ్ మేళా!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 99 రోజుల ప్రగతి ప్రణాళిక ప్రజా పాలనలో భాగంగా మెగా జాబ్ మేళా (MEGA JOB MELA).
భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లా వారి కోసం మెగా జాబ్ మేళా (Mega Job Mela) ఈ నెల 4వ తేదీన ఖమ్మం నందు S.R. Garden లో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. నిరుద్యోగ యువత కోసం అనగా ఇంటర్మీడియట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన యువతకు మార్కెటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఐ.టి, బిజినెస్ సర్వీసెస్, కస్టమర్ సర్విస్, హస్పిటాలిటీ, డిజిటల్ మీడియా, లాజిస్టిక్స్, తదితర రంగాలలో ఉపాధి కల్పిపించుటకు యువజన మరియు క్రీడల శాఖ మరియు పరిశ్రమల శాఖ వారి ఆధ్వర్యంలో సుమారు 70కి పైగా కంపెనీలు ఉమ్మడి ఖమ్మం జిల్లా (అనగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం) వారికి SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్ ఎదురుగా, వైరా రోడ్, ఖమ్మం లో 4/5/2026 నాడు జాబ్ మేళా ఏర్పాటు చేయటం జరుగుతుంది.
ఈ మేళాలో పాల్గొనదలచిన వారు వెబ్సైట్ (website) ద్వారా లేదా QR Code scan చేసి Online లో తమ అప్లికేషన్ (application) పూర్తి చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Website: https://satg.telangana.gov.in/prajapalana
చేసుకొని తేదీ:04/05/2026 నాడు SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్ ఎదురుగా, వైరా రోడ్, ఖమ్మం లో జరుగు జాబ్ మేళా లో ఉదయం 09:00 గంటల నుండి పాల్గొనవలసిందిగా తెలియచేయనైనది.
ఇతర వివరాలకు 9849913068 కు కాల్ చేసి సంప్రదించగలరు.
జిల్లా యువజన మరియు క్రీడల అధికారి.




