Bhadrachalam: సెల్ షాప్ యజమానులకు హెచ్చరికలు జారీ చేసిన డిఎస్పీ అరుణ్ కుమార్!

Bhadrachalam: దొంగిలించిన మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసినా, సాఫ్ట్‌వేర్ మార్చినా కఠిన చర్యలు ఉంటాయని సెల్ షాప్ యజమానులను హెచ్చరించిన డిఎస్పీ అరుణ్ కుమార్.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 16 Sept 2026 1:46 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: సెల్ షాప్ యజమానులకు హెచ్చరికలు జారీ చేసిన డిఎస్పీ అరుణ్ కుమార్!

Bhadrachalam: దొంగిలించిన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసినా లేదా సరైన పత్రాలు లేకుండా వాటి సాఫ్ట్‌వేర్ మార్చినా చట్టపరంగా తీవ్ర చర్యలు ఉంటాయని భద్రాచలం డిఎస్పీ అరుణ్ కుమార్ హెచ్చరించారు.ఇటీవల భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా వరుసగా సెల్ ఫోన్లు అపహరణకు గురవుతున్న నేపథ్యంలో ఆయన పట్టణంలోని సెల్ ఫోన్ హోల్‌సేల్ మరియు రిటైల్ వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి నిర్ధారణ పత్రాలు (Bill/ID Proof) లేకుండా సెల్ ఫోన్లు రిపేర్ లేదా అన్ లాక్ కోసం వస్తే వ్యాపారులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. అధిక లాభాలు లేదా డబ్బులకు ఆశపడి దొంగ ఫోన్ల సాఫ్ట్‌వేర్లు మార్చడం, ఐఎంఈఐ సంఖ్యలను వేరొకదానికి మార్చడం వంటి చర్యలకు పాల్పడితే దొంగతనాలకు ప్రోత్సహించినట్లేనని స్పష్టం చేశారు.

ఇలాంటి అక్రమాలకు పాల్పడే వ్యాపారులను కూడా నేరంలో భాగస్వాములుగా భావించి చట్టప్రకారం దొంగలుగానే పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. వ్యాపారులు పోలీసులకు సహకరించి నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని కోరారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem